ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు
ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు
వాకాడు, , ఏప్రిల్ 8 (సదా మీకోసం) :
వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఐదు రోజుల పాటు జరుగనున్నట్లు ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు తెలియజేశారు.
తొలి రోజున హనుమత్సేవలో భాగంగా స్వామివారికి మేలుకొలుపు, సుప్రభాత సేవ, ప్రాతః కాలార్చన, పంచామృత స్నపనలు జరిపి శ్రీసీతారాములకు అష్టోత్తర శతనామార్చనలు జరిపారు.
ఉభయ కర్తలు దువ్వూరు రామకృష్ణారెడ్డి ,విశాలాక్షి, దువ్వూరు రామచంద్రారెడ్డి, అరుణమ్మ దంపతులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజాదికాలు జరిపించారు.
పూజా కార్యక్రమాలలో శ్రీ రామ సేన యువకులు హరీష్ రెడ్డి, శివ కుమార్, సిద్దయ్య, గురు ప్రసాద్, గురుమూర్తి, రాజేష్, వంశీ, మోహన్, పవన్, వినయ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.