నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు
నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు
కోట, మార్చి 23 (సదా మీకోసం) :
కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం హరిజన వాడలో వెలసియున్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం లో తిరుమల తిరుపతి దేవస్థానములు – హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి…
ఈ కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉపన్యాసకులు దీవి అనంతబాబు ధార్మిక ప్రవచనం తో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని పరిరక్షించడం కోసం, భక్తులకు, ప్రజలకు, చిన్నారులకు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని తెలియజేయడం కోసం ప్రతి వారం ఒక గ్రామంలో మంగళవారం నుండి శుక్రవారం వరకు ధార్మిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, మహిళలచే సామూహిక కుంకుమ పూజ, గోపూజా కార్యక్రమాలు జరుగనున్నట్లు తెలియజేశారు.
సమాజానికి శాంతిని, సామరస్యతను ప్రబోధించి, తెలియజేసినది హిందూ ధర్మం అని అన్నారు. అటువంటి హిందూ ధర్మాన్ని భావితరాలకు తెలియ చేయవలసిన బాధ్యత మన అందరిమీద ఉందని తెలియజేశారు.
ఉపన్యాసం అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని, అనంతరం పండరి భజన చేశారు.
ఈ కార్యక్రమంలో వజ్జా చిన్నయ్య ,ఈదూరు పోలయ్య , మీదూరు. శ్రీనివాసులు పండరి భజన గురువు సంక్రాంతి శ్రీనివాసులు, ఈదూరు వసంతమ్మ,రమాదేవి, మాలపాటి కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.
విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.