నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం

నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం
పులా పరిమళంతో గుమగుమలాడిన ఆలయ ప్రాంగణం
రాపూరు, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) :
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం మరోసారి గోవిందా పెంచలనామ స్మరణతో పులకించిపోయింది.
స్వామి పుష్పభిషేకంతో పులా పరిమళంతో ఆలయ ప్రాంగణం గుమగుమలాడింది.పెంచలకోన క్షేత్రంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు బుధవారం రాత్రి పుష్పయాగం కనులపండువగా నిర్వహించారు.
వివిధ రకాల పుష్పలతో శ్రీవార్లను పాదాల నుంచి తల వరకు రంగు రంగుల పూలతో కప్పి ప్రత్యేకంగా అలంకరించారు.బుధవారం ఉదయం శ్రీవార్లకు ప్రత్యేక పులా అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు.వివిధ రకాల అభిషేకాలు,ప్రత్యక హోమాలు నిర్వహించారు.
కోన లోని శ్రీవారి కల్యాణ మండపంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పుష్పలతో ప్రత్యేకంగా శోభాయమానంగా అలంకరించారు.
1500 కిలోల బరువు ఉన్న సుమారు 25 రకాల పుష్పలను పులా బట్టల్లో తీసుకుని స్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షినలు చేశారు.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య చర్యలు చేపట్టారు.