నేటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు
నేటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు
- ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు
- ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాలు
- నిమిషం నిబంధన అమలు
-: అమరావతి జూలై 4 (సదా మీకోసం) :-
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్-2022 పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
ఈనెల 8వ తేదీ వరకు ఇంజినీరింగ్, 11, 12 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు పరీక్షలు జరుగుతాయి.
ఏపీలో 120, తెలంగాణలో రెండు ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.
మొత్తం 3,00,084 మంది విద్యార్థులు ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
అందుకు తగ్గట్టుగా ఏపీ ఉన్నత విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
అందువల్ల కనీసం అరగంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.