ప్రశాంతంగా దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాపసభ
ప్రశాంతంగా దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాపసభ
నెల్లూరు క్రైం, మార్చి 28 (సదా మీకోసం) :
విపిఆర్ కన్వెన్షన్ హాల్ లో దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి గారి సంతాపసభ కార్యక్రమానికి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా నిర్వహంచినట్లు జిల్లా ఎస్పీ విజయరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనలో సహకరించిన అన్ని విభాగాలు, ప్రజలు, నాయకులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఓపిక, విచక్షణ, సమయ పాలనతో బందోబస్తు నిర్వహించిన సిబ్బంది నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ డిఐజి త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ విజయ రావు అభినందనలు తెలిపారు.
దివంగత మంత్రి సంతాపసభ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డిఐజి సి.యం. త్రివిక్రమ్ వర్మ, జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ విజయ రావు లు, ప్రజా ప్రతినిధులు, పోలీసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.