ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 8 (సదా మీకోసం) :
రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 8 లక్షల 59వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రతిష్టాత్మకంగా అమలుచేయడంతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎన్నడూ లేని విధంగా ఉదారంగా ఆర్ధిక సహాయం అందచేస్తున్నారని వివరించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులకు వైద్యం అందించడంతో పాటు, ప్రత్యేకంగా వైద్యం అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేడు జగన్ మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం కోసం లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని, ఆ ఘనత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దే నని అన్నారు.
కార్యక్రమంలో 18,29,33 డివిజన్ల కార్పొరేటర్లు, నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.