తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు

0
Spread the love

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు

నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు

తొలుత ఉపవాసం ఉన్నవారు ఉపవాసం చెల్లించారు. నాయకులు ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు.అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో నాయకులు ముస్లిం సోదరులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు…

*సోమిరెడ్డి కామెంట్స్*

ముస్లిం మైనారిటీ ల కోసం ఉపయోగ పడాల్సిన మైనారిటీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు.ముస్లిం లకు రావాల్సిన సంక్షేమం నీర్వర్యం అయిపోయాయన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరంలో ముస్లింల కొరకు బారాషహీడ్ దర్గా ను 20 కోట్లతో అభివృద్ధి చేశారని, 8 కోట్లతో షాదీ మహల్ ను అభివృద్ధి చేశారని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో కంటే ఇక్కడే కోలాహలంగా, ఉత్సాహంగా ఉందని అన్నారు.

*బీద రవిచంద్ర కామెంట్స్*

పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా 29 వ దినాన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన అబ్దుల్ అజీజ్ కు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రం లో ఉన్న పరిస్థితులు మారాలని, చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రార్ధన నిర్వహించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

*అబ్దుల్ అజీజ్ కామెంట్స్*

తెలుగుదేశం పార్టీ ప్రతి పండుగ ను గౌరవిస్తుందని, అన్ని మతాల వారితో కలిసి మెలిసి మెలిగే సంప్రదాయం కేవలం తెలుగుదేశం పార్టీ కే చెందుతుందని అన్నారు.

ఈ పవిత్ర రంజాన్ మాసం లో ప్రతి ముస్లిం సోదరులు ఆంధ్ర రాష్ట్రం లో ఉన్న రక్షాస పాలన పోయి తిరిగి చంద్రబాబు ముఖ్య మంత్రి అవ్వాలని అందరూ ప్రార్థించాలి అని కోరారు.

కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ శాసన సభ్యులు కంభం విజయ రామిరెడ్డి, చెంచల బాబు యాదవ్, జెన్నీ రమణయ్య, పమ్మిడీ రవి కుమార్ చౌదరి, సాబీర్ ఖాన్, జాఫర్ షరీఫ్, ఆసీఫ్ పాషా, హయాత్ బాబా మౌలానా అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!