నీటిలో దిగి పరిశీలించి, ట్రాఫిక్ పునరుద్దరణ సూచనలు చేసిన ఎస్పీ విజయరావు
నీటిలో దిగి పరిశీలించి, ట్రాఫిక్ పునరుద్దరణ సూచనలు చేసిన ఎస్పీ విజయరావు
నెల్లూరు క్రైం, డిసెంబర్ 1 (సదా మీకోసం) :
గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద నేషనల్ హైవే 16 వద్ద 3.5 అడుగుల వరదనీటి ఉధృతిలో జిల్లా యస్.పి. విజయ రావు స్వయంగా దిగి పరిశీలించి, ట్రాఫిక్ పునరుద్ధరణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా పోలీసు అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు.
పంబలేరు వాగు ఉధృతి కారణంగా కార్లు, బస్సులు, ప్రయాణికుల వాహనదారులకు ఇబ్బంది లేకుండా అనుమతిస్తూ, సమయానుకూలంగా హెవీ వెహికల్స్ ను పంపడం జరుగుతుందని తెలిపారు. స్విఫ్ట్ సిస్టం లో రౌండ్ ది క్లాక్ బందోబస్త్ వుంచి, ఆగిన వాహనాలకు సపోర్టుగా రెండు జేసీబిలు ఏర్పాటు చేశామని అన్నారు.
నేషనల్ హైవే 16 మీద వరద ఉధృతి నీరు తగ్గించేలా యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశాలు..తగ్గిన వెంటనే ఫ్రీ ఫ్లో అఫ్ ట్రాఫిక్ కు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ పునరుద్దరణ కొరకై ఆయా ప్రాంత అధికారుల సమన్వయంతో వెహికల్ డైవర్షన్ చేయడం జరిగింది.
కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు వద్ద వాహనాల ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్ ను, కోట రోడ్డు వద్ద హైవే ఎక్కే పాయింట్, అనంతరం నాయుడుపేట వద్ద డైవర్షన్ పాయింట్ లను సందర్శించిన తదుపరి నెల్లూరు నుండి తమిళనాడు, తిరుపతి వెళ్ళే డైవర్షన్ రూట్ లో స్వయంగా పర్యటించి అధికారులకు తగిన ఆదేశాలు.. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది.
అదేవిధంగా చెన్నై మరియు తిరుపతి నుండి నెల్లూరు వైపు వచ్చే వాహనాలను నాయుడుపేట నుండి వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, అయ్యప్ప గుడి సెంటర్ మీదుగా హైవేకు కలుపడం జరిగింది.
గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద వరదనీటి ఉధృతి తగ్గే వరకు వాహనాల డైవర్షన్ ఉంటుందని అధికారులకు తగిన సూచనలు ఇచ్చి, వాహనదారులు, ప్రజలు సహకరించాలని జిల్లా యస్.పి. తెలిపారు.