Nellore Festival: రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు : మంత్రి కాకాణి
రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు
- మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలి
- ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలి
- రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) :
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బారాషాహీద్ Nellore Festival రొట్టెల పండుగకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరు బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో శనివారం ఉదయం ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొట్టెల పండుగకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
వివిధ రాష్ట్రాల తో పాటు ఇతర దేశాల భక్తులు కూడా రొట్టెలు పండగకు వస్తారని వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.
పార్కింగ్ దగ్గర నుంచి మౌలిక వసతులు, క్యూ లైన్ ల ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కార్పొరేషన్, ఫైర్, వక్ఫ్ బోర్డ్, ఇంజనీరింగ్ తదితర అధికారులు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. #sadhameekosam
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ హరిత , బారాషహీద్ దర్గా పండుగ చైర్మన్ షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.