నెల్లూరులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నెల్లూరులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నెల్లూరు నగరం, మార్చి 18 (సదా మీకోసం) :
భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ నోటుకు ఓటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డిని భారతదేశంలో ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా అనుమతి ఇవ్వకూడదని భారత దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. భారత దేశ ప్రజలందరికీ వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుందన్నారు.
భారతదేశంలో ఎవరైనా భారతమాత కించపరుస్తూ మాట్లాడితే వాళ్లని దేశద్రోహిగా ప్రకటించాలని చట్టం తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని, ,ప్రధానమంత్రిని కోరుతున్నామన్నారు.
కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. మాధవరావు , రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ శ్రీనాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చంద్ర, శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ , కిరణ్ జిల్లా కార్యదర్శులు హరీష్, లాల్ కాజా, జిల్లా కోశాధికారి వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ , గాంధీనగర్ యువ మోర్చా అధ్యక్షుడు పెంచల బాబు, చిన్న బజార్ యువ మోర్చా అధ్యక్షుడు శివ,యువ మోర్చా అల్లూరు మండలం అధ్యక్షులు హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.