శ్రీశైల పాదయాత్రకు మద్దతు ప్రకటించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక

శ్రీశైల పాదయాత్రకు మద్దతు ప్రకటించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక
ఇందుకూరుపేట, డిసెంబరు 19 (సదా మీకోసం)
ఈ రోజు నెల్లూరు వెంకటేశ్వరపురం స్థానిక వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుండి నెల్లూరు జిల్లా విశ్వహిందూ పరిషత్ మఠ మందిర ఇంఛార్జి సోమరాజుపల్లి నాగఫణిశర్మ ఆధ్వర్యంలో శ్రీశైలానికి పాదయాత్రను చేపట్టారు.
పాదయాత్ర బృందానికి తమ ఆశీస్సులు అందించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక (వి. డి. పి. వి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తూరు లలితా మహేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ రామాయణం మహేష్ స్వామి. ఈ సందర్భంగా మహేష్ స్వామి శ్రీ శైల పాదయాత్రను అభినందిస్తూ, వారికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని, హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు.