సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ

సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ
తోటపల్లి గూడూరు ఏప్రిల్ 02 (సదా మీకోసం)
మండలంలోని మల్లిఖార్జునపురం యస్.సి. కాలనీ నందు వున్న శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం భజన బృందం సభ్యులకు మండపం గ్రామ నివాసి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోహన్ చేతుల మీదుగా యూనిఫారం వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది.
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత హిందూ మహాసభ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పొలవరపు కార్తికేయ, చెంచులక్ష్మి పరియోజన ప్రాంత ప్రముక్ పొట్లూరు శ్రీనివాసులు విచ్చేశారు.
కార్తికేయ మాట్లాడుతూ పల్లెల్లో భజనలతో హిందూ సంప్రదాయాలను కాపాడుతున్నవారు భజన భక్తులని కొనియాడారు.
భజనల వల్ల సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని, బి.పి.,షుగర్ లాంటివి సమతుల్యంగా వుంటాయని, అనాదిగా వస్తున్న హిందూ ఆచారాలు, సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతీ హిందువు పైన వుందన్నారు.
అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ మతమార్పిడి ఎక్కువగా యస్.సి., యస్.టి. గ్రామాల్లోనే జరుగుతుందని, వాటిని నివారించడానికి ప్రతీ హిందూ దేవాలయంలో తప్పనిసరిగా భజనలు చేయాలన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ ధార్మికసభ్యులు అక్కయ్యగారి కనకయ్య, వంగిపూడి రాధాకృష్ణయ్య, కాతారి శీనయ్య, సమరసత సభ్యులు కరణం సుధాకర్, గెద్దే బాలయ్య, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.