సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు

సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు
నెల్లూరు, జూలై 13 (సదా మీకోసం) :
సమాజానికి, చిన్నారులకు దశ, దిశ నిర్దేశించేది గురువులేనని శేషు హైస్కూల్ కరస్పాండెంట్ ఆదిశేషు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఎంపీ అసోసియేషన్, నెల్లూరు జిల్లా రచయితల సంఘం, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శేషు హైస్కూల్లో నిర్వహించిన గురువులకు సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గురుకులాలు నిర్వహించేవారని, ఉచితంగా విద్యను అందించి, ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. గురు శిష్యుల సంబంధం తల్లిదండ్రులతో కంటే మిన్నగా ఉండేదని ఆయన పేర్కొన్నారు.
కార్పోరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత అన్ని సంబంధాలు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేది గురువులేనని ఆయన అన్నారు.
గురు పౌర్ణమిని జాతీయ పండగగా అన్ని విద్యాలయాలలో ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
ఈసందర్బంగా నారాయణ దంత కళాశాల హెచ్ఓడి డా.యన్.కన్నన్, సర్వోదయ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నిర్మల్ కుమార్, శ్రీఅనంత పద్మనాభ డిగ్రీ కాలేజీ విశ్రాంత హెచ్ఓడి సూర్య ప్రకాష్, డి.వి.యన్.యం. జెడ్పి హైస్కూల్ హెచ్ యం. జాకీరా ఖనం, శేషు హైస్కూల్ ఉపాధ్యాయురాలు శశికళ లకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించిన్నారు.
చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో పీఎంపీ జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు అనుముల జయప్రకాష్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, నెల్లూరు డివిజన్ పిఎంపి అధ్యక్ష కార్యదర్శులు గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, వి.రాజేష్, అవినాష్ పాల్గొన్నారు.