పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
తిరుపతి, మార్చి 20 (సదా మీకోసం) :
నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని తిరుపతిలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించారు.
అనంతరం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు.