అదనపు తరగతి గదులుకు భూమి పూజ చేసిన చైర్ పర్సన్ అరుణమ్మ
అదనపు తరగతి గదులుకు భూమి పూజ
నాడు నేడులో భాగంగా భూమిపూజ చేసిన చైర్ పర్సన్ అరుణమ్మ
72 లక్షలతో అదనపు గదులు
పిల్లల భవిష్యత్తుకోసం బంగారు బాట
బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 15 (సదా మీకోసం) :
రేబాల పి.ఆర్.యం జిల్లా పరిషత్ హై స్కూల్ లో నాడు – నేడు రెండవ విడత సంధర్భంగా అదనపు గదులకు భూమి పూజ కార్యక్రమంనకు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొని భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కోవూరు శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నేతృత్వంలో లో నాడు – నేడు రెండవ విడత సంధర్భంగా రేబాల జడ్పీ హై స్కూల్ లో అదనపు గదులకు భూమి పూజ జరగడం ఎంతో సంతోషమని పేర్కొన్నారు.
ఈ హై స్కూల్ నందు ఆరు అదనపు గదులకు గాను ఒక్కొక గదికి 12 లక్షల రూపాయల చొప్పున 72 లక్షలు తో నిర్మించనున్నట్లు తెలిపారు.
పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలో అన్ని సౌకర్యాలతో స్కూల్ ని అభివృద్ధి చేస్తూ పిల్లల భవిష్యత్తు కొరకు బంగారు బాట వేస్తున్న ముఖ్యమంత్రిని అందరు ఆశీర్వాదించ వలసినదిగా కోరారు.
కార్యక్రమం లో రెవిన్యూజాయింట్ కలెక్టర్, జడ్పీ సి.ఇ.వో., డి.ఈ.వో., బుచ్చినగరపాలక సంస్థ ఛైర్ పర్సన్, జడ్పీటిసి, యంపిటిసి, యంపిడివో, సర్పంచ్, హెడ్ మాస్టర్, స్కూల్ పేరంట్ కమిటి వారు, టీచర్లు పాల్గొన్నారు.