నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వెంకటాచలం గ్రామానికి చెందిన మండల మైనార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు పఠాన్ ఖాయ్యుమ్ ఖాన్ చిన్న కుమారుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ వివాహ కార్యక్రమం ఆదివారం పొదలకూరు టౌన్ పరిధిలోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరిగింది.
ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వెంకటాచలం, పొదలకూరు, తోటపల్లిగూడూరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, తలచిరు మస్తాన్ బాబు, సురేష్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, తిరుపతి పార్లమెంటరీ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధా కృష్ణమ నాయుడు, మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ జమీర్ బాషా, సీనియర్ నాయకులు కోదండయ్య నాయుడు, వలిపి మునిస్వామి, షేక్ షరీఫ్, సండి రమేష్, మందల మణి, నలబాలపు వెంకటాద్రి, సయ్యద్ నూరేఇస్లాం, షేక్ జహీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.