ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన ఫించన్లు పంపిణీ

ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన ఫించన్లు పంపిణీ
ఇందుకూరుపేట: జూలై 31 (సదా మీకోసం)
మండలంలోని కొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో వై.యస్.ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పఠాన్ రఫీఖాన్ అధ్యక్షత జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. అందులో భాగంగా నూతనంగా మంజూరైన 337 కొత్త పెన్షన్లు లబ్దిదారులకు తన చేతుల మీదగా ఫింఛన్ కార్డులను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు, ఇందుకూరుపేట కో-పరేటివ్ బ్యాంక్ చైర్మన్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, జిల్లా డి.ఎల్.డి.ఏ. చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట విజయలక్ష్మి, ఎం.పీ.పీ గందళ్ళ శంకరయ్య, వైస్ ఎం.పీ.పీ., ఎం.పీ.టీ.సీ.లు, సర్పంచులు, మండల అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు.