పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 21 (సదా మీకోసం) :
జిల్లాలో పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నగరంలోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 13818 అర్జీలు రాగా అందులో 10088 అర్జీలు పరిష్కరించడం జరిగిందన్నారు.
పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా గడువు దాటిన 16 అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
ప్రతి వారం గడువు లోపల ఉన్న అర్జీలలో కనీసం 50 శాతం పైగా అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. నిర్ణీత 24గంటలు, 48 గంటల్లో పరిష్కరించాల్సినవి ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో అత్యధికంగా అర్జీలు పెండింగులో ఉన్నాయని, వాటిని సంబంధిత శాఖలో ఏ స్థాయిలో పెండింగ్లో ఉన్న ఆ శాఖల అధిపతులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ప్రజల నుండి మళ్లీ మళ్లీ వస్తున్న అర్జీలను జిల్లా అధికారులు బాగా పరిశీలన చేయాలని సంబంధిత అర్జీదారులతో మాట్లాడి సజావుగా పరిష్కారం అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న మళ్లీ వచ్చిన 108 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.
సమావేశంలో రెవిన్యూ సంయుక్త కలెక్టర్ హరెందిర ప్రసాద్, అసరా సంయుక్త కలెక్టర్ రోజ్ మాండ్, డి ఆర్ ఓ బి చిన్న ఓబులేసు, కలెక్టరేట్ స్పందన నోడల్ అధికారి ఎం దాసు, డిఆర్డిఎ, డ్వామా పిడిలు సాంబశివారెడ్డి, తిరుపతయ్య, డి పి ఓ ధనలక్ష్మి, డి.ఎస్.ఒ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో డాక్టర్ రాజ్యలక్ష్మి, సర్వే భూరికార్డుల హనుమాన్ ప్రసాద్, డీఈఓ రమేష్, తదితర అధికారులు పాల్గొన్నారు.