జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
వెంకటాచలం మండలంలోని కసుమూరు కొండ కింద కాలనీలో గిరిజనుల దుస్థితి చూసి చలించిపోయిన సోమిరెడ్డి
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూర్బన్ పనులు తప్ప గత ఐదేళ్లలో కాలనీలో జరిగిన పనులు శూన్యం
ఉరుస్తున్న ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న గిరిజనులు
తాత్కాలికంగా ప్రతి ఇంటికి కప్పేందుకు టార్పాలిన్ పట్టలు తెప్పించడంతో పాటు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన సోమిరెడ్డి
గిరిజనులందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ
ఎక్కువ మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారనే విషయం తెలుసుకుని తల్లిదండ్రులకు క్లాస్ పీకిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ప్రతి గిరిజన బిడ్డను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులకు సూచన
వెంకటాచలం, అక్టోబర్ 16 (సదా మీకోసం) :
వెంకటాచలం మండలంలోని కసుమూరు కొండ కింద కాలనీలో గిరిజనుల దుస్థితి చూసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చలించిపోయారు.
జోరువానలో ఎమ్మెల్యే సోమిరెడ్డి గిరిజనుల వద్దకు వెళ్ళారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూర్బన్ పనులు తప్ప గత ఐదేళ్లలో కాలనీలో జరిగిన పనులు శూన్యం అని వివరించారు.
ఉరుస్తున్న ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న గిరిజనులను చూసి తాత్కాలికంగా ప్రతి ఇంటిని కప్పేందుకు టార్పాలిన్ పట్టలు సోమిరెడ్డి తెప్పించడంతో పాటు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
గిరిజనులందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారనే విషయం తెలుసుకుని తల్లిదండ్రులకు సోమిరెడ్డి క్లాస్ పీకారు. ప్రతి గిరిజన బిడ్డను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులకు సూచన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఏ ప్రాంతానికి వెళ్లినా గిరిజనులు దీనావస్థలో ఉండటం బాధాకరం అన్నారు.
త్వరలోనే ఐటీడీఏ ఆద్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు.
గిరిజనుల సమస్యలను తెలుసుకుని ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి విషయంలోనూ మొదటి ప్రాధాన్యత గిరిజనులకే ఇవ్వబోతున్నామని తెలిపారు.
సమాజంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న గిరిజనుల్లో మార్పు తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అన్నారు.
గిరిజనుల జీవితాల్లో మార్పు కోసం పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులతో పాటు స్నేహితుల సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు.
మనతోటి బిడ్డలైన గిరిజనుల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
కార్యక్రమంలో జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, కుంకాల దశరధనాగేంద్ర ప్రసాద్, లగుంసాని వెంకయ్య నాయుడు, ప్రభాకర్ నాయుడు, వీరేపల్లి బాబురావు, షేక్ అన్వర్ బాషా, షరీప్, బొర్రా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.