నాణ్యతా ప్రమాణాల్లో అగ్రగామిగా వి ఏస్ యూ

నాణ్యతా ప్రమాణాల్లో అగ్రగామిగా వి ఏస్ యూ
వెంకటాచలం, డిసెంబర్ 28(సదా మీకోసం):
విక్రమ సింహపురి యూనివర్సిటీలో డిసెంబరు 27, 28 తేదీలలో ఐఎస్ఓ (ఐ ఏస్ ఓ 9001, ఐ ఏస్ ఓ14001) మొదటి సంవత్సరం సర్వేలన్స్ ఆడిట్ నిమిత్తం ఐ ఏస్ ఓ వాన్ టీమ్ సందర్శించింది.
ఈ రెండు రోజులపాటు, డైరెక్టర్. ఆచార్య అందే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో టీమ్ అధిపతి, లీడ్ ఆడిటర్ అయిన కె.వి. హరగోపాల్ యూనివర్సిటీలోని నాణ్యత ప్రమాణాలు, విధానాలు, నిర్వహణ పద్ధతులు, మరియు మౌలిక వసతుల పరంగా ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నతమైన పరిశీలన నిర్వహించారు.
ఈ సందర్శనలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మెరైన్ బయాలజీ విభాగాలను మరియు ఎగ్జామినేషన్, సెంటర్ లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, ల్యాబ్స్ ను సందర్శించి విభాగాల అధిపతులతో సంభాషించారు.
యూనివర్సిటీ అభివృద్ధికి పలు సూచనలు ఇచ్చి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్.విజయ భాస్కర రావుని కలిసి ఐ ఏస్ ఓ టీమ్ అధిపతి కె.వి.హరగోపాల్ ఐ ఏస్ ఓ 1వ సంవత్సర సర్వేలన్స్ కొనసాగింపు సర్టిఫికేట్ ను అందజేశారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఎస్ విజయ భాస్కర రావు మాట్లాడుతూ ఇది నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో మన బృందం కృషి, అంకితభావానికి నిదర్శనం. ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం అన్ని విభాగాల్లోనూ అమలు చేయగలిగిన నాణ్యతా విధానాలు విద్యార్థులు, అధ్యాపకులు, మరియు సిబ్బందికి మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు దోహదపడతాయి.
ఇది భవిష్యత్తులో మరింత విజయాలను అందించేందుకు మోటివేషన్‌గా పనిచేస్తుంది,” అని చెప్పారు.
అనతరం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత మాట్లాడుతూ “ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రక్రియలో ప్రతి విభాగం అంకితభావంతో పనిచేయడం ద్వారా విశ్వవిద్యాలయం మరింత ఉన్నతమైన ప్రమాణాలను చేరుకుంది.
ఇది మన నిర్వహణ విధానాలకు, మౌలిక వసతుల మెరుగుదలకు, మరియు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నిలిచే ప్రయత్నాలకు ప్రతిఫలంగా భావించవచ్చు.
ఇలాంటి విజయాలు విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంచడమే కాకుండా, అన్ని వర్గాలకు ప్రేరణనిస్తూ తదుపరి లక్ష్యాలను చేరుకోవడానికి మార్గదర్శకంగా నిలుస్తాయి,” అని అన్నారు.
అలాగే ఐ కీవ్ ఏ సి డైరెక్టర్ ఆచార్య అందే ప్రసాద్ మాట్లాడుతూ ఐఎస్ఓ టీమ్ అందించిన సూచనలను జాగ్రత్తగా పాటించి, మరింత మెరుగైన ప్రమాణాలను సాధించేందుకు ఐ కీవ్ ఏ సి విభాగం అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు.
“మన నాణ్యతా ప్రమాణాలను నిరంతరం మెరుగుపరచి విద్యార్థుల ప్రగతికి అవసరమైన అన్ని వనరులను అందించేందుకు కృషి చేస్తాము,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ కి, పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్ .మధుమతి పాల్గొనారు.