రైతు దినోత్సవం జరిపే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

0
Spread the love

రైతు దినోత్సవం జరిపే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు

జగన్మోహన్ రెడ్డి పాలనలో పెన్నాడెల్టా ప్రాంతంలో క్రాఫ్ హాలిడే

వైసీపీ ప్రభుత్వం నిలువునా దగా చేస్తుంది

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

నెల్లూరు, జూలై 8 (స‌దా మీకోసం) :

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రైతు ధగా దినోత్సవం లో భాగంగా,జోరు వానలో సైతం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన కార్యాక్రమం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఈ ఆందోళన లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.12,500 రైతు భరోసా ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం రూ.7500 మాత్రమే ఇస్తూ రైతులను దగా చేశారన్నారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి,రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిన ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయకుండా రైతులను దగా చేశారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకూ కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. ముఖ్యంగా ధాన్యం పండించిన రైతులను వైసీపీ ప్రభుత్వం నిలువునా దగా చేసిందన్నారు.

పుట్టి ధాన్యానికి 850 కేజీలు తీసుకోవలసి ఉండగా,మిల్లర్లు వైసీపీ నాయకులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది కుమ్మక్కు అయ్యి పుట్టి ధాన్యానికి 1100 కేజీలు తీసుకుంటున్నారు.

దీని వలన ప్రతి రైతు పుట్టికి రూ.4 వేల వరకూ నష్టపోయారన్నారు. రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మూడు నెలలు గడిచినా ఇంతవరకు వారికి డబ్బులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

మరోవైపు కమిషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తున్నారు.రైతుల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.

ఒక వైపు పెరిగిన సాగు ఖర్చులు,మరో వైపు పెట్టిన పంటకు సరైన దిగుబడి రాక,పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ప్రభుత్వం లో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు.

చరిత్ర లో ఎన్నడూ లేనివిధంగా నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా ప్రాంతంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకిటించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు పరిస్థితి ఏవిధంగా ఉందొ అర్ధమవుతుందని పేర్కొన్నారు.

కావున ఈ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదు.అందుకే తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధగా దినోత్సవం జరుపుతోందన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలను మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ,వర్షం ను కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!