గూడూరు బంద్‌కు సహకరించండి
గూడూరు బంద్‌కు సహకరించండి
శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ
గూడూరు సాధన సమితి పిలుపు
నెల్లూరు, మార్చి 1 (సదా మీకోసం) :
గూడూరు పట్టణ సిపిఎం కార్యాలయంలో గూడూరు సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో, గూడూరు సాధన సమితి కన్వీనర్ సిపిఐ నాయకులు ఎస్.కె. కాలేషా అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, మార్చి 2వ తేదీన జరిగే గూడూరు బంద్ ను గూడూరు పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
పునర్విభజనలో భాగంగా గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ ప్రజల యొక్క మనోభావాల ప్రకారం గూడూరు నియోజకవర్గంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ,విద్యార్థి సంఘాలు కలిసి గూడూరు సాధన సమితి గా ఏర్పడి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
విద్యార్థులచే మానవహారం, అఖిలపక్షం ఆధ్వర్యంలో మూడురోజుల రిలే నిరాహార దీక్షలు లాంటి కార్యక్రమాలు చేసి నిరసన తెలియజేయడం జరిగింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం గూడూరు పట్టణ బంద్ కు పిలుపునిచ్చామన్నారు. పట్టణ ప్రజలందరూ మీ యొక్క నిరసనను నిశ్శబ్దంగా మీ ఇంటి వద్దనే ఉండి మీ యొక్క దుకాణాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు కార్యాలయాలు అన్నిటిని మూసి వేసివేసి ఆటోలను ఆపేసి,మీయొక్క నిరసనను ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పట్టణ ప్రజలు, వ్యాపారులు , వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు , విద్యార్థులు ఆటో కార్మికులు, వివిధ యూనియన్ కార్మికులు ,కూరగాయల మార్కెట్, సినిమా హాళ్ళు, హోటల్స్ అన్నిటిని స్వచ్ఛందంగా మూసివేసి ఉదయం నుండి సాయంత్రం వరకు బంద్ ను సంపూర్ణంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అఖిల పక్షం పార్టీల నాయకులు, టిడిపి నాయకులు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ ,అబ్దుల్ రహీం, పిల్లెళ్ళ శ్రీనివాసులు, రావుల శివ ప్రసాద్ గౌడ్, మోహన్, అమరయ్య నాయుడు, అల్లం సాయి, వేముల సునీల్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.