పివి నర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం

పివి నర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం
-: నెల్లూరు నగరం, జూన్ 28 (సదా మీకోసం) :-
నెల్లూరు తూర్పు ప్రాంతాలు బాలాజీ నగర్లో ఘనంగా మాజీ ప్రధాని పివి నర్శింహరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.
బాలాజీ నగర్ ఉగాది సెంటర్లో పివి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పూలమాలలతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యావత్ భారతదేశం గర్వించదగ్గ తెలుగుజాతి బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు అని కొనియాడారు.
పివి శత జయంతి ఉత్సవాలు నిర్వహించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.
పివి ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
పి వి నరసింహారావు తెలంగాణా వాసి అయినప్పటికీ రాయలసీమ ప్రాంతమైన నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించి దేశానికి ప్రధాని కావడం ద్వారా ఆ ఘనత తెలంగాణా కన్నా ఆంధ్రాకే ఎక్కువగా దకుతుందన్నారు.
ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువాడు ప్రధానిగా పోటీ చేస్తే ఏకగ్రీవంగా పార్లమెంటుకు పంపాలని పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టలేదని, అదే తెలుగుదేశం పార్టీ ఘనత అని గుర్తుచేశారు.
కాంగ్రెస్, వైసీపీ పార్టీలు పట్టించుకోకపోయినా తెలుగుదేశం పార్టీ ఏకైక తెలుగు ప్రధానిగా పివి ని సంస్మరించుకుంటోందని తెలిపారు.
తాను ప్రధాని పదవి చేపట్టిన నాటికి భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదకర స్థాయిలో ఉండి దేశ పరువు ప్రతిష్టలు బంగారం రూపంలో తాకట్టు పెట్టి ఉన్న పరిస్థితిలో ఈ దేశంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ నిర్ధేశించిన కారణంగానే ప్రపంచం అంతా ఆర్ధిక ఒడిదుడుకులు అయినా భారతదేశం తట్టుకొని నిలబడకల్గింది అంటే పివి గారి పాలనాదక్షతకు అదే నిదర్శనమన్నారు.
ఈనాడు పేదవిద్యార్థులకు వరప్రసాదమైన రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది పివి నేనని గుర్తు చేశారు.
సంస్కరణల ద్వారా ఐటి రంగాన్ని విస్తృత పరచి కోట్లాది మంది యువతకు వుద్యోగవకాశాలు కల్పించిన ప్రధాని పివి అన్నారు.
బహుభాషా కోవిడుదుగా, తత్వశాస్త్ర వేత్తగా రాజనీతి ప్రజ్ఞాశాలిగా సమర్ధ పాలనాదక్షుడుగా పి వి నరసింహారావు ని చిరస్మరణీయ ప్రధానిగా తెలుగుజాతి ఎన్నటికీ మరచిపోదని ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో సివిఎల్ నరసింహం, గుడ్లదోన వాసుదేవరావు, శ్రీనివాసులు రెడ్డి, ఆకుల హనంతరావు, తానే మస్తాన్, పసుపులేటి మల్లికార్జున రావు, దేవిశెట్టి ప్రసాద్, యెస్ కే సుభాన్ భాష, వేణు, శ్రీనివాస రావు, సాహిత్ రెడ్డి, వంశీ మరియు పి వి అభిమానులు పాల్గొన్నారు.