నోరు తెరిచే దమ్ము లేని వాళ్ళు ఎంతమంది ఉండి ఏమిలాభం : సోమిరెడ్డి

0
Spread the love

*ఢిల్లీలో నోరు తెరిచే దమ్ము లేకుండా 22 మంది ఎంపీలు, ఐదారుగురు రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకో*

*మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఆర్.శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తదితరులు*

*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*

🟡 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది.

🟡ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత కరువు ప్రాంతాలైన వీటిని సస్యశామలం చేసేందుకు ఎన్టీఆర్ హంద్రీనీవా, గాలేరు-నగిరి, తెలుగుగంగ వంటి ఎన్నో పథకాలు చేపట్టారు.

🟡ఈ ప్రాజెక్టులన్నింటికి చంద్రబాబు నాయుడు ఒక రూపు తెచ్చారు.రాజశేఖర్ రెడ్డి వాటిని కొనసాగించారు.

🟡వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తిగా ఆపేశారు.రాయలసీమను ఏం చేయాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

🟡చిన్నచిన్న ప్రాజెక్టులపైనా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్రప్రభుత్వం పెత్తనం తీసుకున్నా సీఎంగా జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరం.

🟡మరోవైపు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు శ్రీశైలం నీళ్లలో హక్కు లేదంటారు..హంద్రీనీవా మూత వేయమంటారు..పోతిరెడ్డిపాడుద్వారా నీళ్లు తీసుకునేదానికి లేదంటారు.

🟡ఇలాంటి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ను చూసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదు.

🟡ఓ వైపు కేసీఆర్ కు, మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి భయపడుతూ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేస్తారు.

🟡151 సీట్లతో అధికారం ఇస్తే రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారనుకున్నారు కానీ…ఇంతగా రాష్ట్రాన్ని నాశనం చేస్తావనుకోలేదు.

🟡రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కనీసం జగన్మోహన్ రెడ్డి నోరు ఎత్తకపోవడం బాధాకరం.

🟡విభజన చట్టంలో పేర్కొన్న వెలిగొండ ప్రాజెక్టును కూడా ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ లో లేకుండా చేస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు.

🟡వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ లో చేర్చమని నిన్న ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రిని కలిసివచ్చారు.

🟡క్రిష్ణా డెల్టాకు పట్టిసీమ నుంచి 100 టీఎంసీల నీళ్లు వస్తున్నాయి..ఆ దామాషా ప్రకారం రాయలసీమకు నికర జలాలుగా కేటాయించమని కోరుతున్నాం..

🟡చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత కాలం తెలంగాణ ప్రభుత్వం ఈ జలవివాదాలకు తెరలేపలేదు.

🟡జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.చివరకు శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడు కూడా లెఫ్ట్ పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పత్తి చేసి విలువైన జలాలను సముద్రానికి వదిలేశారు.

🟡వరదలు పోటెత్తిన ఈ సీజన్ లో కూడా తెలంగాణ వాళ్లు ఎక్కువగా వాడుకున్నందున ఈ రోజు శ్రీశైలంలో నీటిమట్టం 158 టీఎంసీలకు చేరిపోయింది..అంటే దాదాపు 55 నుంచి 60 టీఎంసీల నీటిని వాడేశారు..

🟡వరదలు వచ్చినప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి ఏంటి.

🟡పొరుగు రాష్ట్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే మన హక్కులను కాపాడుకునే విషయంలో మౌనంగా ఉన్నారంటే ఎవరిని చూసి భయపడుతున్నారు.

🟡కేసీఆర్ ను చూసి భయపడుతున్నారా.ఎన్నికల సందర్భంగా మీకు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టిన సంగతి బయటపెడతారనే భయంతో మౌనంగా ఉన్నారా.లేక ఢిల్లీని చూసి వణుకుతున్నారా.

🟡ఇది సహించరాని విషయం.మీకు ప్రశ్నించే ధైర్యం లేకపోతే అఖిలపక్షాన్ని పిలవండి.నా వల్ల కాలేదు..నిస్సహాయుడిని,సీఎంగా జలవివాదాల విషయంలో చేతులెత్తేశానని ఒప్పుకోండి.

🟡ఢిల్లీలో నోరు తెరిచే దమ్ము లేకుండా 22 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు.

🟡క్రిష్ణా జలాల విషయంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు.ప్రజలు తిరగబడటం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!