రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం

రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం
కావలి, నవంబర్ 20 (సదా మీకోసం) :
“న్యాయస్థానం టు దేవస్థానం” పేరుతో అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లాకు చెందిన అఖిల పక్ష నేతలు స్వాగతం పలికారు.
రాజధాని అమరావతి రైతులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, బొల్లినేని వెంకట రామారావు, సిపిఎం, సిపిఐ నాయకులు దామా అంకయ్య, మాల్యాద్రి, ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ కన్నబాబు, మాలేపాటి సుబ్బానాయుడు సంఘీభావం తెలిపారు.
నేడు నెల్లూరు జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన కావలి రూరల్ మండలం రాజువారి చింతల పాలెం దగ్గర అమరావతి రైతులకు కావలి అఖిలపక్ష కమిటీ నేతలు స్వాగతం పలికారు. అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ తో “న్యాయస్థానం టు దేవస్థానం” పేరుతో రైతులు తలపెట్టిన మహాపాదయాత్ర ఏ మాత్రం పట్టు సడలకుండా, మొక్కవోని దీక్షతో అవిశ్రాంతంగా సాగుతోందన్నారు.