రైతులకు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలి : జిల్లా కలెక్టర్

రైతులకు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలి : జిల్లా కలెక్టర్
-: నెల్లూరు కలెక్టరేట్, జూన్ 30 (సదా మీకోసం) :-
సోమశిల ప్రాజెక్టు 32వ ప్యాకేజీకి సంబంధించి ఎ.ఎస్.పేట మండలంలోని జమ్మవరం, కాకర్లపాడు, గుమ్మర్లపాడు గ్రామాల్లో భూములు ఇస్తున్న రైతులకు.., నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి భూముల విలువను మరోసారి పరిశీలించాలని అధికారులను కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు ఆదేశించారు.
బుధవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్.., అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం తమకు ప్రభుత్వం అందించే పరిహారం, మార్కెట్ వాల్యూ కన్నా తక్కువగా ఉందని.., అందువల్ల తమకు అందించే పరిహారం విషయంలో మరోసారి పునఃపరిశీలించాలని జిల్లా కలెక్టర్ కి రైతులు విజ్ఞప్తి చేశారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదిక అందించిన తర్వాత, దాని ప్రకారం ప్రభుత్వం నుంచి రైతుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
సమావేశంలో తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ నాగేశ్వర్రావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.