టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ…!

ప్రతి ఇంటికి రెండు విసనకర్రలు.. రెండు కొవ్వొత్తులు
మూడేళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత ఇది
ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ
నెల్లూరు నగరం, ఏప్రిల్ 09 (సదా మీకోసం) :
గత మూడేళ్ల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విద్యుత్ కోతలతో చీకటిమయం చేశాడని టిడిపి నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు.
నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘం, చీపురు కట్ట సంఘం, సర్వేపల్లి కాలువ కట్ట తదితర ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా టిడిపి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రెండు విసనకర్రలు, కొవ్వొత్తులు ఉచితంగా అందజేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనతకు ఇంటింటికి తిరిగి వీటిని అందిస్తున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు. పరిపాలన చేతకాని దద్ద…. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.
అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కార్యక్రమంలో టిడిపి నెల్లూరు నగర అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, కమ్మ కళ్యాణి, ఆకుల హనుమంతరావు, రేవతి, కువ్వారపు బాలాజీ, కప్పిర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.