బాలిరెడ్డిపాళెం లో సరస్వతీ పూజ

బాలిరెడ్డిపాళెం లో సరస్వతీ పూజ
వాకాడు, మార్చి 28 (సదా మీకోసం) :
వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల ముందు ప్రతి సంవత్సరం జరిపించే సరస్వతి పూజ అంగరంగవైభవంగా జరిపించారు.
శ్రీ పట్టాభి రామాలయం ప్రధాన అర్చక స్వామి దీవి అనంతాచార్యులు శాస్త్రోక్తంగా విద్యార్థినీ విద్యార్థుల చే పూజలు జరిపించారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు విద్య వలన విజ్ఞానం పెరగడమే కాకుండా సమాజానికి మేలు జరుగుతుందని కనుక ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని తద్వారా సమాజానికి ఉపయోగపడాలని హితవు పలికారు.
విద్యార్థులు భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు జే.వి.యస్. లక్ష్మి, వై. గిరిధర్ రెడ్డి , ఎల్. సుమలత,యస్.నాగరాజు, సి ఆర్ పి ఐ.ప్రదీప్, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేరీ నయోమి, సుబ్రహ్మణ్యం, కరీముల్లా, సుధాకర్, రోశయ్య, దేవదాసు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు