నిత్యం ప్రజల్లో ఉంటా… ప్రజల తోనే నడుస్తా…. : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నిత్యం ప్రజల్లో ఉంటా… ప్రజల తోనే నడుస్తా
గ్రామీణ ప్రాంతాల్లోని గడపగడపకు వెళుతున్నా
గొల్ల కందుకూరు నుంచి శ్రీకారం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 09 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏ్రపిల్ 11 నుంచి జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి బాట పేరిట కార్యక్రమం చేపట్టినట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.
నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా తన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఏప్రిల్ 11వ తేది 9.15 గంటలకి గొల్లకందుకూరు గ్రామం నుంచి జగనన్న మాట గడప గడపకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.
9 నెలల కాలంలో 18 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతి ఇంటింటికివెళ్తానని తెలిపారు.
33 రోజులు, 18 గ్రామాల్లో తిరుగుతా, వారం విరామం తీసుకుని మళ్ళీ తిరుగుతానని ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాలకు తప్ప మిగతా రోజుల్లో గడప గడపకు కార్యక్రమం ఉంటుందని, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ,అభివృద్ధి గురించి వివరిస్తానని, ప్రభుత్వ పధకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు. మా లోటుపాట్లు తెలుసుకుని సరిచేసుకుంటూ.. అడుగులు వేస్తామని, ప్రజల్లో ఉండడం నాకు ఇష్టం, అందుకే ప్రతి ఇంటిలో వారితో నేను ఏకాంతంగా మాట్లాడుతా.. వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకుంటామని, నిరాడంబరంగా కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎమ్మెల్యే గా నా పరిధిలోని పని వెంటనే చేస్తా. అవసరం అయితే రాష్ట్ర మంత్రులతో మాట్లాడి పని చేస్తానని అన్నారు
జిల్లా అధికారులను 24 గంటల్లో అక్కడికి పిలిపించి సమస్యలను పరిష్కరిస్తానని, పార్టీలతో సంబంధం లేకుండా అందరిళ్లకు వెళతా విమర్శలను సాదరంగా స్వాగతిస్తాను…ఐదేళ్లకు ఒకసారి వెళ్లే ఎమ్మెల్యేగా నేను ఉండను… నిరంతరం నేను ప్రజల్లో ఉంటాను…. వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు.
ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ప్రజల పక్షాన నిలబడ్డాను. కార్యకర్తలు, నాయకులకి అండగా నిలిచాను. ఎమ్మెల్యేలు ప్రజలు.. వేరు కాదు….మీ ఇంట్లో వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఎలా ఉంటుందో నేను అలానే ఉంటానని, కరోనా ముందే నేను ఈ కార్యక్రమం ప్రారంభించాలనుకున్నానని, 29న ఈద్గా ప్రారంభోత్సవం తప్ప ఈ 33 రోజులు ప్రతి ఇంటికి వెళ్తా….వారం విరామం ఇచ్చి మరో 33 రోజులు తిరిగి మళ్ళీ ఇంటింటికి వెళ్తానని తెలిపారు.
అందరు ఎమ్మెల్యేలకి మంత్రి అవ్వాలని ఆశ ఉంటుందని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకే అందరం నడుచుకుంటామని, పార్టీ అంతర్గత విషయాలని ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా బయటకి చెప్పను….ఒక సైనికుడిగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ముందుకు సాగుతానని తెలిపారు.