అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్

అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్
-: చిల్లకూరు, జూన్ 29 (సదా మీకోసం) :-
చిల్లకూరు మండలం గుమ్మళ్లదిబ్బ వద్ద మద్యం అక్రమ రవాణా చేస్తున్న నరసయ్య అనే వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
ముద్దాయి కరోనా లాక్ డౌన్ ను అనుకూలంగా మార్చుకొని ముత్తుకూరు మండలంలో వివిధ మద్యం షాపుల వద్ద మద్యాన్ని కొనుగోలు చేసి తన కూల్ డ్రింక్ షాపులో ఉంచి అక్రమంగా అమ్మేవాడని తెలిపారు.
మద్యం అక్రమ రవాణా ,విక్రయం వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
మీడియా సమావేశంలో గూడూరు డిఎస్పీ యం. రాజగోపాల్ రెడ్డి,గూడూరు రూరల్ సిఐ శ్రీనివాసులురెడ్డి, చిల్లకూరు ఎస్సై సుధాకర్ రెడ్డి ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.