టిడిపి వాణిజ్య విభాగం కమిటీల ఎంపిక
టిడిపి వాణిజ్య విభాగం కమిటీల ఎంపిక
నెల్లూరు ప్రతినిధి, జూలై 24 (సదా మీకోసం) :
నెల్లూరు నరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వానిజ్య విభాగం రాష్ట్ర నాయకుల సమక్షంలో నెల్లూరుసిటి, నెల్లూరు రూరల్ నియోజక వర్గాల వాణిజ్య విభాగం కమిటీలను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కింజవరపు అచ్చం నాయుడు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ , నెల్లూరు రూరల్, వాణిజ్య విభాగ నియోజకవర్గ కమిటీ నియమించినట్లు తెలిపారు.
ఈ కమిటీని నెల్లూరు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు దర్శి హరికృష్ణ, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కొండా ప్రవీణ్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, జిల్లా మైనార్టీ నాయకులు సాబీర్ ఖాన్, జిల్లా వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మునీర్, తమ్మన నాగేశ్వరావు, తమ్మన శివశంకర్ ఆధ్వర్యంలో స్టేట్ నుంచి వచ్చిన వాణిజ్య విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ చేతుల మీదుగా కమిటీలోని పేర్లను విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి శ్రీధర్, రవికుమార్, తేజ, మీరా, దగ్గోలు శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు నగరం
అధ్యక్షులు : గుణపతి కృష్ణ తేజ
ప్రధాన కార్యదర్శి : కోట మధుసూదన రావు
నెల్లూరు రూరల్
అధ్యక్షులు : బిల్లుపాటి రవి
ప్రధాన కార్యదర్శి : కాలంశెట్టి మోహన్ రావు