మార్చి 31న ముస్లింల దీక్ష… ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాట దీక్ష
మార్చి 31న ముస్లింల దీక్ష
ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాట దీక్ష
ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది
ముస్లింల హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్
నెల్లూరు రూరల్, మార్చి 24 (సదా మీకోసం) :
మార్చి 31న జరగబోవు ముస్లింల దీక్ష లో భాగంగా నగరంలోని చెరుకుపల్లి పిచ్చి రెడ్డి కళ్యాణ మండపాన్ని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, జిల్లా టీడీపీ నేతలతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎన్నికల ముందు ముస్లింలకు అనేక హామీలు ఇచ్చి నేడు మాట తప్పి ముస్లింలకు తీరని అన్యాయం చేస్తున్నారని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరుస్తామని తెలిపారు.
ప్రభుత్వంపై పోరాటం అవసరమని గొంతు విప్పకపోతే, పోరాటం చేయకపోతే ఏమి దక్కేలా లేవని అన్నారు.
జగన్ రెడ్డి పాదయాత్ర లో నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
మనకోసం మనమే పోరాడాలని, ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ముస్లిం మైనార్టీలకు రావాల్సిన హక్కులు సాధించేవరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంటుందని తెలిపారు.
ముస్లింలకు రావాల్సిన ప్రతి హక్కును సాధించుకునేందుకు నగరంలోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో దీక్షను చేపడుతున్నామని తెలిపారు.
వారితో పాటు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, మైనుద్దిన్, సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, గంగాధర్,ఊరందూరు సురేంద్ర బాబు, అబీద సుల్తానా, జియా ఉల్ హక్, యశ్రబ్, రసూల్, అబ్దుల్ మస్తాన్, ఇక్బాల్, ఉస్మాన్, చోటు, షాహుల్, పాషా మొహిద్దిన్, జాఫర్, నౌషాద్, ఖలీల్, కరీముల్ల, సత్తార్, రబ్బానీ, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.