మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాల‌న‌లో ఏం చేశారు ? శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

0
Spread the love

మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాల‌న‌లో ఏం చేశారు ?

శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

నెల్లూరు న‌గ‌రం, మార్చి 22 (స‌దా మీకోసం) :

మంత్రి అనీల్ కు ద‌మ్ము, దైర్య‌ముంటే.. ఈ వెయ్యిరోజుల్లో మంత్రిగా ఏం అభివృద్ది చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాల‌ని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి డిమాండ్ చేశారు.

గ‌త ప్ర‌భుత్వంలో అనేక అభివృద్ది ప‌నులు చేస్తే.. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనీల్ కుమార్ యాద‌వ్.. ఆ ప‌నుల‌ను పూర్తి చెయ్య‌లేక చేతులెత్తేశాడ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

నెల్లూరులోని ఎన్టీయార్ భ‌వ‌న్ లో కోటంరెడ్డి మీడియాతోమాట్లాడుతూ ప్ర‌త‌ప‌క్షాల‌పై నోరేసుకుని మీద ప‌డే అనిల్ కు.. రెండుసార్లు ఎమ్మెల్యేను చేసిన సిటీని అభివృధ్ది చెయ్యాల‌నే చిత్త‌శుద్ది కూడా లేద‌న్నారు.

ల‌క్ష‌ల కుటుంబాలు స్వ‌చ్చ‌మైన నీరందించాల‌నే ల‌క్ష్యంతో తెలుగుదేశం ప్ర‌భుత్వం సంగం నుంచి పైప్ లైన్ నిర్మాణం చేసి.. 90శాతం ప‌నులు పూర్తి చేస్తే.. అనీల్ దాన్ని పూర్తిచెయ్య‌లేక‌పోయాడ‌న్నారు. అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నుల‌ను తాము ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప‌నులు శ‌ర‌వేగంగా చేస్తే, ఆ ప‌నుల‌ను క‌నీసం అడుగు కూడా ముందుకు క‌దిలించ‌లేక‌పోయాడ‌ని ఆరోపించారు.

చేత‌కాని వ్యక్తుల‌కు మంత్రి ప‌ద‌వులిస్తే, అభివృద్ది ప‌నులు ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించారు. టిడ్కో ఇళ్లు, పార్కుల‌ను నాశ‌నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వీట‌న్నింటిపై చ‌ర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని, అనీల్ కు ద‌మ్ముంటే, అత‌ను చేసిన అభివృద్దిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాల‌ని డిమాండ్ చేశారు.

నెల్లూరు బ్యారేజీని 90శాతం పూర్తి చేసిన ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు.

ఈ ప్ర‌భుత్వంలో ప్ర‌తిప‌క్షాల మీద నోరేసుకుని ప‌డేవాళ్ల‌కే మంత్రి ప‌ద‌వులు ఇస్తున్నార‌ని ఆరోపించారు.

అభివృద్ది చేస్తాన‌ని చెప్పి.. సిటీ ప్ర‌జ‌ల‌ను అనీల్ మోసం చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

స‌మావేశంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాసులు, నగర అధ్యక్షులు ధర్మవరపు, సుబ్బారావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు హరి, నగర తెలుగుయువత అధ్యక్షులు గుండేటి నాగేంద్ర, మాజీ కార్పొరేటర్ పుట్టి సత్యనాగేశ్వరరావు, కువ్వరపు బాలాజీ, కొండ ప్రవీణ్, పసుపులేటి మల్లికార్జున్, సురేష్, తానే మస్తాన్, రామగిరి సుబ్బు, తిరుపతి, శ్రీనివాసులు గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!