వైసిపి అరాచకాలు, అవినీతిని ఎండగడతాం.. : అబ్దుల్ అజీజ్
నెల్లూరు రూరల్ లో గడప గడప తొక్కుతా…
వైసిపి అరాచకాలు, అవినీతిని ఎండగడతాం..
- వైసిపి అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలే మన విజయానికి నాంది…
- నెల్లూరు రూరల్ లో వైసీపీ ని పునాదులతో సహా పెకలించి వేద్దాం…
- నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్
నెల్లూరు రూరల్, జనవరి 30 (సదా మీకోసం) :
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేతలతో ఆదివారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలే అజెండాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అతి త్వరలోనే తన పాదయాత్ర ప్రారంభమవుతుందని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలకు అతి త్వరలోనే చరమగీతం పాడుతామని పేర్కొన్నారు.
గత రెండున్నర ఏళ్ల వైసిపి పరిపాలన హయాంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటాయన్నారు.
చివరకు చెత్తను కూడా వదలకుండా పన్ను వేసిన ప్రభుత్వంగా వైసిపి అపవాదును మూటగట్టుకుందని విమర్శించారు.
ఒక లక్ష్యం ప్రకారం రాజకీయాల్లోకి వచ్చానని రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసానని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు…
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు…
ఎప్పుడైతే ప్రజల్లో ఉంటామో ఆరోజే మన విజయానికి నాంది అని ఆయన పేర్కొన్నారు…
కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అనేక మోసపూరిత వాగ్దానాలతో గెలుపొందిన కార్పొరేటర్లు నేడు ప్రజా సమస్యలను మరిచిపోయి మొహం చాటేస్తున్నారని విమర్శించారు.
గెలవక ముందు ఒక మాట గెలిచిన తర్వాత మరో మాట వైసీపీకి మొదటి నుంచి అలవాటేనన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాదయాత్ర కు సంబంధించి తొందర్లోనే ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పునాదులతో సహా పెకలించే సమయం దగ్గరపడిందన్నారు.