గుడి బడి తీస్తే కరోనా వస్తుందా! – మద్యం షాపులు తీస్తే కరోనా రాదా! : చేజర్ల

0
Spread the love

గుడి బడి తీస్తే కరోనా వస్తుందా! – మద్యం షాపులు తీస్తే కరోనా రాదా! : చేజర్ల

-: కోవూరు క‌లెక్ట‌రేట్‌, ఆగస్టు 9 (స‌దా మీకోసం) :-

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవక ముందు రోజుకి పదుల సంఖ్యలో వస్తున్న కరోనా కేసులు, మద్యం దుకాణాలు తెరిచిన తరువాత వేళా సంఖ్యలో వస్తున్నాయన్నారు. రాష్ట్రములో కరోనా కేసులు రోజు రోజుకు పేరిగిపోతున్నాయనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ లాక్‌డౌన్ అమలు చేస్తూ అన్ని రకాల దుకాణాలు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తీసుకోవాలని చెప్పిన ప్రభుత్వం మద్యం దుకాణాల కు మాత్రం రాత్రి 8 గంటల వరకు అనుమతించార‌ని విమ‌ర్శించారు.

కరోనా వైరస్ విస్తరిస్తుందని గుడుల, బడులు మూసివేసిన ప్రభుత్వం మద్యం దుకాణాలను మాత్రం తెరిచారనీ, గుడి, బడి తెరిస్తే మాత్రం కరోనా వస్తుందా! మద్యం షాపులు తెరిస్తే మాత్రం కరోనా రాదా! అని ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రికి ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయమే ముఖ్యమైనదని అందుకే పల సరకులు అమ్మే దుకాణాలు మాత్రం ఒంటి గంట దాటితే పోలీసులు వెళ్ళి బలవంతంగా మూయిస్తున్నారనీ, మద్యం దుకాణాలను మాత్రం రాత్రి 8 గంటల వరకు తెరిపిస్తున్నారని విమ‌ర్శించారు.

కరోనా నేపథ్యంలో ప్రజలకు పనులు లేక ఆదాయం లేక పూట గడవడమే కష్టంగా ఉన్న సమయంలో మద్యం షాపులు తెరవడమే కాకుండా వాటి ధరలను విపరీతంగా పెంచడముతో మద్యం కు అలవాటు పడిన వ్యక్తులు కుటుంబాలు చిన్నా బిన్నము అవుతున్నాయన్నారు. గత వారం రోజులుగా ప్రతి రోజు దేశంలోనే ఎక్కడ లేనివిధంగా రోజుకు 10 వేళకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను మూసి వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, కలికి సత్యనారాయణ రెడ్డి, పాలూరు వెంకటేశ్వర్లు, ఎస్‌.కే. నాజీర్ తదితరులు పాల్గొన్నారు.

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!