ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు
ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు
ఉస్మాన్ సాహెబ్ పేట నుంచి బోడి గాడి తోట వరకు అంతిమయాత్ర
నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) :
నెల్లూరు నగర మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం వందలాది మంది అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు.
నెల్లూరు నగర ప్రజలకు ఎమ్మెల్యేగా ముంగమూరు చేసిన సేవలను గుర్తు చేసుకొని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.
నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట నుంచి బోడి గాడి తోట వరకు అంతిమయాత్ర సాగింది.
అంతిమయాత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, గూడూరు నియోజకవర్గ ఇంఛార్జి పాసిం సునీల్ కుమార్, సీనియర్ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి, టిడిపి నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, కప్పిర శ్రీనివాసులు, పొత్తూరి శైలజ, సాబీర్ ఖాన్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.