జర్నలిస్టులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
జర్నలిస్టులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
-: నెల్లూరు ప్రతినిధి, జూలై 26 (సదా మీకోసం) :-
జర్నలిస్టులకు ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్‌లో తన వంతుగా తోడ్పడుతుందని నెల్లూరు ఆర్డీవో డి. హుసేన్ సాహెబ్ అన్నారు. సోమవారం నగరంలోని యూకే నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇవ్వడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని అందుకు అందరూ తోడ్పడాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించి మాస్క్లులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు.
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్య సిబ్బంది మున్సిపాల్ కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా కరోనాను లెక్కచెయ్యకుండా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు.
ఈ సందర్బంగా ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ను ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నయీంఖాన్, ఏపీ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్‌లు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జర్నలిస్టులతో పాటు డాక్టర్ దేవి కృపా సిబ్బంది జన్నత్ హుస్సేన్, కామేశ్వరి, మేరీ తదితరులు పాల్గొన్నారు.
#sadhameekosam