బయో ఎనర్జీ ప్లాంట్ల శంఖుస్థాపన కు అన్ని ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ హరి నారాయణన్
బయో ఎనర్జీ ప్లాంట్ల శంఖుస్థాపన కు అన్ని ఏర్పాట్లు చేయండి
కలెక్టర్ హరి నారాయణన్
వెంకటాచలం, సదా మీకోసం :
వెంకటాచలం మండలం సర్వేపల్లి లో ఏర్పాటు చేయనున్న బయో ఎనర్జీ ప్లాంట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు.
క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వారు సర్వేపల్లి లో బయో ఇథనాల్ ప్లాంట్, విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమటెడ్ మరోబయో ఎనర్జీ ప్లాంట్ ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్లాంట్లు ధాన్యం ఆధారంగా పనిచేస్తాయని నూకలు ,తడిసిన ధాన్యం, జొన్నలను ముడి పదార్థాలుగా వినియోగిస్తామని వాటి నుండి బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని, . రాబోయే రోజులలో వాహనాలకు ఇందనంగా వినియోగించవచ్చనీ దీనినుండి వచ్చే పిప్పి నుండి పశుదానా తయారుచేస్తారనీ, ఈ పరిశ్రమల వల్ల కాలుష్యం ఉండదని క్రిబ్కో మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, విశ్వసముద్రం ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి హేమేంద్ర నాయుడు కలెక్టర్ కు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ గా దీన్ని ప్రారంభిస్తున్నందున అక్కడ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో ఏర్పాట్లపై చర్చించారు.
నిరంతర విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు, సౌండ్ సిస్టం, స్క్రీన్స్ శిలాఫలకం ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
కార్యక్రమంలో ఆర్డిఓ మాలోల, విద్యుత్ శాఖ ఈఈ సోమ శేఖర రెడ్డి, ఎం.ఆర్.ఒ, కంపెనీ ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.