వైసీపీ ప్రభుత్వ పాలన లో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది, యువతను చైతన్యపరిచి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం : చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్
వైసీపీ ప్రభుత్వ పాలన లో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది,
యువతను చైతన్యపరిచి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం
తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్
తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటనలో చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్ తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగు యువత నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు గా నన్ను నియమించిన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ కి, తెలుగు యువత అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.
తనపై నమ్మకం తో సహకరించిన తెదేపా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ కి, పొలిట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి , ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి, మాజీ మంత్రి పొంగూరు.నారాయణకి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
టి.ఎన్.ఎస్.ఎఫ్. జిల్లా ఉపాధ్యక్షులు గా నేను చేసిన సేవలను గుర్తించి, తెలుగుయువత నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులుగా బాధ్యతలను అప్పగించిన తెదేపా అధినాయకత్వానికి సదా రుణపడి ఉంటానన్నారు.
నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని యువత సమస్యల పరిష్కారం తో పాటు తెలుగు యువత బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు.
యువత భవిష్యత్తు ను అంధకారం లోకి నెడుతున్న వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పై రాజీ లేని పోరాటాలు చేస్తానన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో యువత కు కలిగిన ప్రయోజనాలను, వైసీపీ ప్రభుత్వ హయాంలో యువతకు జరుగుతున్న అన్యాయం పట్ల యువతను చైతన్య పరుస్తానని తెలిపారు.
రాబోవు సార్వత్రిక ఎన్నికలలో, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ గెలుపు కు శక్తివంచన లేకుండా శ్రమించేలా యువతను సంఘటితం చేస్తామని ప్రతినబూనారు.