మృగాళ్ల దాడి లో బలైన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు లోకేశ్ వెళుతుంటే, వైసీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు ? – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
మృగాళ్ల దాడి లో బలైన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు లోకేశ్ వెళుతుంటే, వైసీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు ?
– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర –
అమరావతి లో మీడియాతో మాట్లాడుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
నరసరావుపేటలో అనూష అనే యువతిని దారుణంగా చంపేసిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది ?
అమల్లో లేని దిశాచట్టం కింద ముగ్గురికి ఉరిశిక్షలు, 20మందికి యావజ్జీవశిక్ష లు వేశామని హోం మంత్రి చెప్పిన రోజే మహిళల మానప్రాణాలపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధేమిటో తేలిపోయింది.
దిశాచట్టం ఫైలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్యనే తిరుగుతోందని డీజీపీ చెబుతుంటే, ముఖ్యమంత్రి, మంత్రులేమో దిశాచట్టంకింద 21 రోజుల్లో నిందితులకు శిక్షలంటూ ప్రచారాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి ఇంటి సమీపంలో జరిగిన ఘటనలో దిశాచట్టం అమలైందా? వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఆడ బిడ్డ ల కుటుంబాలకు అండగా నిలుస్తున్న టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేశ్ గురించి వైసీపీ నాయకులు అవహేళనగా మాట్లాడటం, పోలీస్ శాఖ వారికి వత్తాసు పలకడం సిగ్గు చేటు.
గతంలో లోకేశ్ ని కర్నూలుకు వెళ్లనీయలేదు, ఇప్పుడేమో నరసరావుపేటకు వెళ్లొద్దంటున్నారు. రాష్ట్రం లో పరామర్శించే స్వేచ్చ కూడా లేదా ? అసలు రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో ఉందా ?
రమ్య ఘటనలో వైసీపీ ప్రభుత్వం చేసిన న్యాయం ఏమిటో డీజీపీ చెప్పగలరా?
డీజీపీ గారూ… టీడీపీవారికి చట్టాలపై అవగాహన కల్పించడం కాదు… ముందు పోలీసులను దూషిస్తున్న వైసీపీవారి నోళ్లకు తాళాలు వేయండి.
పోలీస్ శాఖను అధికారపార్టీనేతలు, మంత్రులు అవహేళన చేస్తుంటే, డీజీపీ ఏనాడూ వాటిని ఖండించలేదు.
లోకేష్ పర్యటన అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు గత తెదేపా ప్రభుత్వం కూడా ఇలానే అడ్డుకుని ఉంటే మీరు పాదయాత్ర, ఓదార్పుయాత్ర పూర్తి చేసేవారా ?
మహిళలపై జరుగుతున్న దారుణాలకు సంబంధించి, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పలుమార్లు డీజీపీకి, ముఖ్యమంత్రికి లేఖ రాస్తే నామమాత్రపు స్పందనకూడా లేదు.
ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటనలకు పరిమితమయ్యారు తప్ప, అఘాయిత్యాలకు బలవుతున్న ఆడబిడ్డలకు న్యాయం జరగడంలేదు.
బాధిత మహిళలకు న్యాయం కోరుతూ తెలుగు మహిళలు కొవ్వొత్తులర్యాలీ చేపడితే ఎందుకు అడ్డుకున్నారు? మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిపై ఎందుకంత కాఠిన్యంగా ప్రవర్తించారో డీజీపీ సమాధానం చెప్పాలి.
నారా లోకేశ్ గారు స్వేచ్ఛగా నరసరావు పేట కు వెళ్లి, అనూష కుటుంబాన్ని పరామర్శించేలా డీజీపీ, పోలీసులు వెంటనే అనుమతించాలి.