భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన
భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన
నెల్లూరు, డిసెంబర్ 1 (సదా మీకోసం) :
వరదలకు అతలాకుతలం అయిన నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. వరదలకు దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు.
స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న కమిషనర్ దినేష్ కుమార్ ను ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ సఫియా బేగం పాల్గొన్నారు. ఈనెల 3వ తేదీనా భగత్ సింగ్ కాలనీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు.