హలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : మురళీకృష్ణ యాదవ్

హలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మురళీకృష్ణ యాదవ్
రాపూరు: హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మురళీకృష్ణ యాదవ్ కోరారు.
రాపూరు లో ఆయన పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం బీసీ విద్యార్ది రాష్ట్ర కన్వీనర్ మురళి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీసీ విద్యార్థి నాయకులు అలాగే యువజన, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా జనాభాలో సుమారుగా 53% బీసీ జనాభా ఉండి ఈరోజు చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము.
అటువంటి తరుణంలో మనల్ని అన్ని రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్తే మనకి దేశ జనాభాలో సగభాగం వాట ఉన్న మనకి మన దామాషా ప్రకారం రాజ్యసభ ,పార్లమెంటు, అసెంబ్లీ, శాసనమండలి, స్థానాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని జాతీయ అధ్యక్షులు గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ ఆదేశాలను అనుసారం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కోర్ కమిటీ అధ్యక్షులు బుల్లెట్ సురేష్ ఆశీస్సులతో అలాగే గౌరవ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ విద్యార్థి, యువత అలాగే బీసీ సంక్షేమ సంఘం కమిటీ ఈనెల ఢిల్లీలో జరగబోయే ఆగస్టు 9న పార్లమెంట్ ముందు భారీ ప్రదర్శన అలాగే పార్లమెంట్ ముట్టడి అలాగే ఆగస్టు 10న జంతర్ మంతర్ దగ్గర బీసీల రాష్ట్ర దేశ జనాభాలో బిసి కులాల వారీగా కుల గణన పై లేఖలు తెచ్చామని. అలాగే చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి అని కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని. అలాగే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లులో రిజర్వేషన్ కల్పించాలి అని. అలాగే బీసీలకు క్రిమిలేయర్ విధానం రద్దు చేయాలని అని. ఆగస్టు 10వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర బారి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
అలాగే ఈ యొక్క డిమాండ్లు అన్నిటి మీద కూడా గౌరవ కేంద్ర మంత్రివర్యులనూ ఆగస్టు 11వ వాళ్ల అందరిని కలిసి విజ్ఞాపన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.కావున నెల్లూరు జిల్లా నలుమూల నుండి బీసీ సోదరీ సోదరీమణులు విద్యార్థిని విద్యార్థులు యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు వెంకటేష్, విజయ్, మనోజ్, సురేంద్ర, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.