వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

0
Spread the love

వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర

నెల్లూరు కార్పొరేషన్ ఓటర్ల జాబితా అంతా తప్పులు తడక

ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా,ఆఖరుకు హైకోర్టు తప్పులు సరిదిద్దామన్న సరిదిద్దలేదు

ఓటర్ల జాబితాలోని అవకతవకలను బూత్ కమిటీలు గుర్తించి పార్టీకి అందించాలి

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

నెల్లూరు, జూలై 3 (సదా మీకోసం):

తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, గతంలో రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు,బీజేపీ పార్టీలు మాత్రమే కేడర్ బేస్ పార్టీలుగా ఉండేవి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఎన్టీఆర్ ప్రభంజనం లో పార్టీ అధికారం లోకి వచ్చినప్పటికీ,1985 లో చంద్రబాబు నాయుడు గారు ప్రధానకార్యదర్శి గా భాద్యతలు చేపట్టిన తరువాత తెలుగుదేశం పార్టీని కేడర్ బేస్ పార్టీగా తీర్చిదిద్దాలని తెలిపారు.

చంద్రబాబు నాయుడు నాయకత్వం లో దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి బూత్ స్థాయినుండి పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేశారన్నారు.

ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే బూత్ కమిటీలదే కీలక పాత్ర.గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల గిర్తింపు కష్టంగా ఉంటుంది. కావున పట్టణ ప్రాంతాల్లో బూత్ కమిటీలపై మరింత బాధ్యత ఉంటుందని తెలిపారు.

గతంలో కంటే భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఈదపా ప్రతి 25 వేల ఓట్లను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి దానికి ఒక సీనియర్ నాయకుడను క్లస్టర్ ఇంఛార్జిగా నియమించారు.అదేవిధంగా ప్రతి 5 వేల ఓటర్లు ను ఒక యూనిట్ గా చేసి దానికి ఒకరిని యూనిట్ ఇంఛార్జిగా నియమించారన్నారు.

అదేవిధంగా ప్రతి బూత్ కు ఒక కన్వీనర్, ప్రతి 100 మంది ఓటర్లు కు ఒక్కరిని బూత్ కమిటీ సభ్యులుగా నియమించారు.వీరందరూ ఇప్పటినుండి ఎన్నికలు వరకూ వారి పరిధిలో ఓటర్ల జాబితా దగ్గరి నుండి అన్ని కార్యక్రమాలు చేపట్టవలసి ఉందన్నారు.

కావున క్లస్టర్ ఇంచార్జి,యూనిట్ ఇంచార్జి, బూత్ కమిటీ కన్వీనర్, బూత్ కమిటీల సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేసి వచ్చే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గములో పార్టీని ని గెలిపించడానికి ఇప్పటి నుండే పని చేయాలని కోరారు.

నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 2009 నుండి నెల్లూరు కార్పొరేషన్ ఓటర్లు జాబితా తప్పులు తడకగా తయారైంది.భర్త ఓటు నెల్లూరు సిటీ లో ఉంటే భార్య ఓటు రూరలో ఉంది.మరికొన్ని ఓట్లు రెండు నియోజకవర్గాల లో ఉన్నాయని విమర్శించారు.

కొన్ని వేల ఓట్లకు డోర్ నెంబర్లు కూడా లేవని, ఓటర్ల జాబితాలో అవకతవకలు పై ఎన్ని మార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు సరిదిద్ది కొత్త ఓటర్ల జాబితా తయారు చేయమని హైకోర్టు ఆదేశించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

కావున బూత్ కమిటీ సభ్యులు తమ బూత్ ఓటర్ల జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మీ బూత్ పరిధిలోని తప్పులను గుర్తించి పార్టీకి అందచేయాలని కోరారు.

సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ ఇంచార్జి అబ్దుల్ అజిజ్, నెల్లూరు నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు తాళ్ళపాక అనురాధ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!