మహర్షి వాల్మీకిని స్మరించుకోవడం అదృష్టం : మేయర్ పొట్లూరి స్రవంతి
మహర్షి వాల్మీకిని స్మరించుకోవడం అదృష్టం
మేయర్ పొట్లూరి స్రవంతి
నెల్లూరు కార్పొరేషన్, ఆక్టోబర్ 9 (సదా మీకోసం) :
రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకిని స్మరించుకోవడం అదృష్టమని, భవిష్యత్ తరాలకు రామాయణ గ్రంధాన్ని పరిచయం చేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి తెలిపారు.
మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బోయవానిగా జీవితాన్ని ప్రారంభించిన వాల్మీకి తపస్సుతో ఉన్నతమైన మార్పు సాధించాడని, సంస్కృతంలో తొలిగ్రంధాన్ని రచించి ఆదికవిగా నిలిచిపోయారని కొనియాడారు.
తపస్సు సమయంలో చీమల పుట్ట శరీరంపై నిర్మించబడినందున వాల్మీకి అని పేరు పొందారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ హరిత, కార్పొరేటర్ యాకసిరి వాసంతి, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.