పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి : మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్
గూడూరు, మార్చి 28 (సదా మీకోసం) :
గూడూరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ కోరారు. సోమవారం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూడు,గూడు,గుడ్డ నినాదాలతో తెలుగు నేలపై తెలుగు ప్రజల సమక్షంలో యుగపురుషుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ని స్థాపించారని తెలిపారు.
పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, కార్యకర్తల సహకారాలతో ఘన విజయాలు సాధించామన్నారు.
మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా మంగళవారం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, వార్డు నందు జెండా ను ఆవిష్కరించి, నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించాలని అన్నారు.
సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయం నందు జరిగే ఆవిర్భావ దినోత్సవంనకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తప్పక పాల్గొనాలని కోరారు.