బొల్లినేని నర్సింగ్ కళాశాల కోవిడ్ క్వారెంటన్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురం లో ఉన్న బొల్లినేని నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారంటైన్ సెంటర్ ను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఆకస్మికంగా సందర్శించి, క్వారంటైన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వారికి అందిస్తున్న వైద్య సేవలు, భోజన వసతులను పరిశీలించారు. క్వారంటైన్ సెంటర్ లో ఇప్పుడు ఉన్న బెడ్స్ సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం తోపాటు నాణ్యమైన భోజన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్లో పారిశుద్ధ్య ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులకు సూచించారు.