వైసీపీ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకూ సాయం లేదు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకూ సాయం లేదు
పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు నగరం, ఆగస్టు 6 (సదా మీకోసం):
నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 82వ రోజున 41వ డివిజన్ స్థానిక కపాడిపాళెంలోని అరవ వీధిలో జరిగింది.
ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు.
పేదలు ఎక్కువుగా నివసించే ఈ ప్రాంతంలో పలు ఇళ్లల్లో గర్భిణీ స్త్రీలు కనిపిస్తే వారికి ప్రభుత్వం నుండి సాయం అందుతోందా లేదా అని ఆరా తీయగా అందట్లేదని బదులిచ్చారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పేద మహిళలు గర్భంతో ఉన్న సమయంలో వారికి అందాల్సిన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనా సాయం అందట్లేదని అన్నారు.
గర్భిణీ మహిళల పౌష్టికాహారం కోసం, మందుల కోసం ఒక్కొక్కరికీ మూడు దఫాలుగా 5000 రూపాయల సాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉమ్మడిగా అందాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 102 కోట్ల రూపాయలు నిధులు ఇందుకోసం అందించిందని, రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల రూపాయలను కలిపి పథకం అమలుచేయాల్సి ఉండగా ఇప్పుడు కేంద్ర నిధులకూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద జవాబుదారీతనం లేదన్నారు.
దీంతో కేంద్రం నుండి నిధులు ఆగాయని, రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది గర్భిణీ స్త్రీలు సాయాన్ని కోల్పోయారని అన్నారు.
ఈవిధంగా వైసీపీ ప్రభుత్వం ఆఖరికి పేద గర్భిణీ స్త్రీల నిధులను కూడా వదల్లేదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి దుయ్యబట్టారు. కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.