రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్”
రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్”
నెల్లూరు విద్య మార్చి 28 (సదా మీకోసం) :
నగరంలోని డైకసరోడ్ లో గల డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రాముర్తి నాయుడు పాల్గొని పిల్లలు చేసిన మ్యాథ్స్ మోడల్స్ ను, ప్రాబ్లమ్స్ ను సులభంగా ఎలా సాధించాలో చక్కగా వివరించిన విద్యార్థులను అభినందించారు.
మ్యాథ్స్ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అని పిల్లలకు మ్యాథ్స్ పట్ల ఇష్టం ఏర్పడాలి అంటే ఇటువంటి ఎగ్జిబిషన్ చాలా అవసరమని అన్నారు.
అందరు విధిగా కోవిడ్ నిబంధనలును పాటిస్తూ విటువంటివి ఎన్నో జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థి విద్యార్థినిలకు, ఉపాద్యాయులుకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలను డైరెక్టర్లు డా,, కృష్ణా కిషోర్, వాసంతి కిషోర్, పాఠశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, సీ ఓ సుగుణ, మేనేజర్ విజయచంద్ర ఉపాద్యాయులు అభినందించారు.