హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై అవగాహన పెంచండి : కమిషనర్ డి. హరిత
హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై అవగాహన పెంచండి
కమిషనర్ డి.హరిత
నెల్లూరు కార్పొరేషన్, ఆగస్టు 6 (సదా మీకోసం):
భారతదేశ 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ఈ నెల 1 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై జిల్లా స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ డి.హరిత సూచించారు.
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచనల మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 8.30 నిముషాలకు స్థానిక సర్వోదయా కళాశాల ప్రాంగణం నుంచి గాంధీ బొమ్మ వరకు చైతన్య ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ర్యాలీలో అన్ని డివిజనుల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ విభాగాల అధికారులు, సచివాలయం కార్యదర్శులు, వార్డు వలంటీర్లు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.