పారశుధ్య పనులను పరిశీలించిన కర్తం ప్రతాప్‌రెడ్డి
పారశుధ్య పనులను పరిశీలించిన కర్తం ప్రతాప్‌రెడ్డి
-: నెల్లూరు నగరం, జూన్ 28 (సదా మీకోసం) :-
14వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి ఈ రోజు డివిజన్ పరిధిలోని ఏసీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీ కాలువలు, పారిశుధ్య పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖామంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలపై పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
మురుగునీటి పారుదలకు ఆటంకాలు కలుగకుండా చూడాలని, పారిశుధ్య పరిస్థితులను మెరుగు పరచాలని సిబ్బందికి సూచించారు.
మున్సిపల్ డీఈ సురేష్ గారితో ఫోన్ లో మాట్లాడుతూ రబ్బిష్ ను ఎత్తివేసేందుకు ఒక ట్రాక్టర్ ను, రోబో ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చూడాలని, డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.
రోడ్లపై ఎక్కడా చెత్త చెదారం లేకుండా చూడాలని శానిటరీ సెక్రటరీ వెంకటేశ్వర్లకు సూచించారు.